జ్యోతిష్య శాస్త్రం లో ద్వాదశ రాశులు లక్షణాలు
1) మేషరాశి: అశ్విని నక్షత్రం 1,2 ,3 ,4 పాదములు భరణి నక్షత్రం 1,2 ,3 ,4 పాదములు కృత్తికా నక్షత్రం 1, వ పాదములో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు. మేష రాశి కి చిహ్నము గొర్రె. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. కాబట్టి వీరు భగభగమండే తత్త్వం, కోపం, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. అగ్నితత్త్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం, చురుకుదనం కలిగి ఉంటారు. క్షత్రియ రాశి కూడా కావడంతో పురుషాహంకారం, పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. రాశీ చక్రంలో మొదటిరాశిగా చెప్పుకొనేది మేషరాశి. ప్రారంభం నుండి 300 వరకు అవధి కలిగిన ఈ రాశిలో అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదము మొత్తము 2 నక్షత్రాలు పూర్తిగా మూడవ నక్షత్రములోని 1పాదము ఉన్నాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం ఏప్రియల్ 14 – మే 14 మధ్యలో పుట్టిన వారిని మేషరాశి జాతకులుగా చెప్పబడ్డారు. మీరు మేష లగ్నం, మేషరాశి వారు అని చెప్పడానికి 10 లక్షణాలు: 1....