జ్యోతిష్య శాస్త్రం లో ద్వాదశ రాశులు లక్షణాలు

1) మేషరాశి:

అశ్విని నక్షత్రం 1,2 ,3 ,4 పాదములు

భరణి నక్షత్రం 1,2 ,3 ,4 పాదములు

కృత్తికా నక్షత్రం 1, వ పాదములో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు.


మేష రాశి కి చిహ్నము గొర్రె.


ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. కాబట్టి వీరు భగభగమండే తత్త్వం, కోపం, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. అగ్నితత్త్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం, చురుకుదనం కలిగి ఉంటారు. క్షత్రియ రాశి కూడా కావడంతో పురుషాహంకారం, పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు.

రాశీ చక్రంలో మొదటిరాశిగా చెప్పుకొనేది మేషరాశి. ప్రారంభం నుండి 300 వరకు అవధి కలిగిన ఈ రాశిలో అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదము మొత్తము 2 నక్షత్రాలు పూర్తిగా మూడవ నక్షత్రములోని 1పాదము ఉన్నాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం ఏప్రియల్ 14 – మే 14 మధ్యలో పుట్టిన వారిని మేషరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు మేష లగ్నం, మేషరాశి వారు అని చెప్పడానికి 10 లక్షణాలు:

1. మీ అభిప్రాయాలు పెద్దగా పట్టించుకోకపోయినా

2. మీరు సాహసవంతులు, దుడుకు స్వభావం కలిగినవారైనా

3. చిరుతిళ్ళు ఇష్టపడే వారైనా

4. ఎప్పుడూ పెద్దగా బోరు ఫీలవ్వని వారైనా

5. తొందరగా ఆవేశపడే వారైనా

6. అందరికంటే ముందు ఉండాలనుకునే వారైనా

7. అందరితో పాటే నేను అనుకునే వారైనా

8. మంచి సలహాలు చెప్పగలిగిన వారైనా

9. అమసరమైన వాటిని సీరియస్‌గా తీసుకోనివారైనా

10. ముక్కుసూటిగా ఉండే వారైనా ...

మీరు తప్పకుండా మేషరాశివారే ...

2) వృషభ రాశి:


కృత్తిక 2, 3, 4 పాదములు

రోహిణి 1, 2, 3, 4 పాదములు

మృగశిర 1, 2, పాదములు


వృషభ రాశికి చిహ్నం వృషభం అనగా ఎద్దు


ఇది స్థిరరాశి.. కాబట్టి ఈ రాశివారు స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఆలోచనలు, నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు. అనుకొన్న దానిగురించే ఎక్కువ ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు. ఈ రాశికి శుక్రుడు అధిపతి. తొందరపడకుండా ఆగి నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో నేర్పులు. ఏదైనా కార్యం ప్రారంభిస్తే పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు.


రాశీ చక్రంలో రెండవరాశిగా చెప్పుకొనేది వృషభరాశి. మేషరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 30 – 60 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. కృత్తిక 3వ పాదాలు, రోహిణి, మృగశిర 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం మే 15- జూన్14 మధ్యలో పుట్టిన వారిని వృషభరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు వృషభ లగ్నం, వృషభరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు

1. స్థిరమైన అభిప్రాయములు, ఉద్దేశ్యములు ఉన్నవారైతే 

2. మంచి సుఖలాలసులు అయితే...

3. అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చేవారైతే

4. రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోతే

5. మీకు మీరే పెద్ద విమర్శకులైతే

6. స్వతంత్రంగా ఉండాలనుకుంటే 

7. అప్పుడప్పుడు నాటకీయత ప్రదర్సించే వారైతే

8. సహాయం చేసేవారైతే

9. మీకు నమ్మదగిన వారు అనుకుంటే 

10. ఎంత కష్టపడడానికి వెనుక అడుగు వేయనివారైతే ... 

మీరు తప్పకుండా వృషభరాశివారే ...

3) మిథున రాశి:

మృగశిర 3,4 ఆరుద్ర 1, 2, 3, 4 పునర్వసు1, 2, 3

మిధున రాశికి చిహ్నం భార్యాభర్తలు


ఇది స్వభావరాశి. అధిపతి బుధుడు. చరరాశిలా వేగంగా కదులుతూ, స్థిర రాశి మాదిరి స్థిరత్వంవైపు మొగ్గుచూపుతారు. చురుకుదనానికి మారుపేరు. గ్రహదోషం ఉంటే తప్పా, వీరిని ఆపలేరు. అన్ని స్థితులలతోనూ సమభావం చూపుతారు. ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి. సర్దుబాటు స్వభావం, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు.

రాశీ చక్రంలో మూడవరాశిగా చెప్పుకొనేది మిథునం. వృషభరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 60 - 90 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. ఈ రాశిలో మృగశిర 2, ఆర్ద్ర పూర్తిగా, పునర్వసు 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం జూన్15 – జూలై 16 మధ్యలో పుట్టిన వారు మిథునరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు మిథున లగ్నం, మిథునరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు

1. ఆకర్షణీయమైన వ్యక్తిత్వము, 

2. ఒకేసారి అనేక పనులు చేపట్టగలిగే నేర్పు,

3. తమ భావాలను చక్కగా చెప్పగలిగే నేర్పు,

4. స్థిరత్వము విశ్రాంతి లేకపోవడం, 

5. ఒక్కోసారిగా కఠినులుగా మారిపోవడం,

6. సరదాగా ఉండేవారు, హాస్యప్రియులైతే, 

7. భిన్నమైన మానసిక స్థితి (హృదయానికి, ఆలోచనలకు పొంతన లేకపోతే)

8. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగలిగిన వారైతే,

9. అనేకమంది మిత్రులున్నా అంతరంగిక మిత్రులు కొందరే అయితే, 

10. పూర్తిగా ఆధారపడదగినవారనే పేరు అంటే వేరే వారికి మీరు చాలా నమ్మకమైన వారు అయితే

మీరు తప్పకుండా మిథున రాశివారే ...

4) కర్కాటక రాశి:

పునర్వసు 4 వ పాదము, పుష్యమి 1, 2, 3,4, ఆశ్లేష 1, 2, 3, 4


కర్కటక రాశికి చిహ్నం పీత


ఇది చర రాశి. అధిపతి చంద్రుడు. ఆలోచనలు వేగంగా మారిపోతాయి. నిర్ణయాలు కూడా సంతరించుకుంటాయి. సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణ చేస్తారు. ఆలోచనలకు, కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు. మానసిక సంఘర్షణలు, మానసిక వేదన ఉంటుంది. తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది. వీరికి విశ్లేషణా సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

రాశీ చక్రంలో నాల్గవరాశిగా చెప్పుకొనేది కర్కాటకం. మిథునరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 90 - 120 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. ఈ రాశిలో పునర్వసు 1, పుష్యమి 4, ఆశ్రేష 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం జూలై 17 – ఆగష్ట్ 16 మధ్యలో పుట్టిన వారు కర్కాటకరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు కర్కాటక లగ్నం, కర్కాటకరాశి వారు అని చెప్పడానికి 10 లక్షణాలు:


1. ఇంటిపట్టునే ఉండడానికి ఇష్టపడేవారైతే, 

2. మనస్సులో ఉన్నది దాచుకోలేని వారైతే,

3. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నవారైతే,

4. నమ్మదగినవారు, ఓదార్పు కోరుకునేవారైతే, 

5. సంప్రదాయములపై ఇష్టం కలిగిన వారైతే,

6. విమర్శలు పడలేని వారు, చేయనివారైతే, 

7. కళలపై మక్కువ కలిగినవారైతే 

8. ప్రేమలు,ఆప్యాయతలు ఎక్కువయితే,

9. మంచి భోజనప్రియులైతే, 

10. ఏదోదో ఊహించుకుని భాధపడేవారైతే. 

మీరు తప్పకుండా కర్కాటక రాశివారే ...

5) సింహ రాశి:

మఖ 1, 2, 3,4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1,


సింహరాశికి చిహ్నం సింహం 

అధిపతి సూర్యుడు. స్వభావ రీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది. జంతువులకు రాజు సింహం దీనికి సూచిక. ఈ రాశిలో జన్మించినవారిలో సహజసిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది. కొత్త, పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు. ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. లౌక్యం అలవరచుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు.


రాశీ చక్రంలో ఐదవరాశిగా చెప్పుకొనేది సింహరాశి. కర్కాటకరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 120 – 150 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. మఖ 4, పుబ్బ 4, ఉత్తర 1 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం ఆగష్ట్ 17- సెప్టెంబర్ 17 మధ్యలో పుట్టిన వారిని సింహరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు సింహ లగ్నం, సింహరాశి వారు అని చెప్పడానికి 10 లక్షణాలు

1. ఆకర్షనీయమైన రూపం కలిగినవారైతే, 

2. స్వతంత్ర ఆలోచనలు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవారైతే

3. కార్యనిర్వహణా సామర్థ్యం కలిగినవారైతే 

4. అహంకారం ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటే

5. నమ్మదగినవారు, మంచివారనే పేరు కలిగినవారైతే 

6. ఆశావహ దృక్పథము కలిగినవారైతే 

7. విశేషమైన శక్తి యుక్తులు కలిగినవారైతే 

8. ముక్కుసూటిగా ప్రవర్తించేవారైతే 

9. ముక్కుసూటితనం కలిగినవారైతే 

10. పొగడ్తలంటే ఇష్టత కలిగినవారైతే ... 

మీరు తప్పకుండా సింహరాశివారే ...

6) కన్యా రాశి:


ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదములు


అధిపతి బుధుడు. ద్వి స్వభావ రాశి. కాబట్టి రెండువైపులా ఆలోచిస్తుంటారు. అన్న విషయాల్లోనూ లోతుగా పరిశీలిస్తారు. అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు. విభిన్నమైన అంశాల్ని పరికిస్తూ ఉంటారు. ఆలోచనకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అంత తేలిగ్గా దేనినీ వదలరు. ప్రతిదాన్నీ ఒకటికి రెండుసార్లు తర్కిస్తారు. అనుమానం కూడా ఈరాశివారికి సహజ సిద్ధమైన లక్షణం. మహిళలయితే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశివారికి ధైర్యం పాలు కాస్త తక్కువ. ఆహారం మీద ఆసక్తి ఉంటుంది. స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది

రాశీ చక్రంలో ఆరవరాశిగా చెప్పుకొనేది కన్యరాశి. సింహరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 150 – 180 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. ఉత్తర 2 3 4, హస్త 4, చిత్ర 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం సెప్టెంబర్ 17 – అక్టోబర్ 17 మధ్యలో పుట్టిన వారిని కన్యరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు కన్య లగ్నం, కన్యరాశి వారు అని చెప్పడానికి 10 లక్షణాలు:


1.సృజనాత్మకత కలిగినవారైతే 

2. నమ్రత వినయం కలిగినవారైతే 

3. సిగ్గరి అయితే

4. విశ్లేషణ మరియు సంపూర్ణ వివరాలతో ఆలోచన కలిగినవారైతే 

5. స్థిరమైన పనులు చేసేవారైతే

6. సరియైన నిర్ణయం తీసుకోగలిగినవారైతే 

7. ఆదరణ, ప్రేమ చూపించే వారైతే

8. అతిగా విమర్శించేవారైతే

9. ఆడంబరాలు ఇష్టంలేనివారైతే 

10. అనసరమైతే కఠినంగా ఉండేవారైతే ... 

మీరు తప్పకుండా కన్యారాశివారే ...

7) తులా రాశి:

చిత్త 3, 4, స్వాతి 1, 2, 3,4 విశాఖ 1, 2,3


తులా రాశికి చిహ్నం త్రాసు


తుల రాశి కి అధిపతి శుక్రుడు.. జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగి పోకుండా ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు. గుంభనంగా ఉంటారు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకుపై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాలలొ రాణిస్తారు. ఆర్ధిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్థులని అభివృద్ధి చెస్తారు. అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు.

రాశీ చక్రంలో ఏడవరాశిగా చెప్పుకొనేది తులారాశి. కన్యారాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 180 – 210 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. చిత్ర 3 4, స్వాతి 4, విశాఖ 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం అక్టోబర్ 18 – నవంబర్ 16 మధ్యలో పుట్టిన వారిని తులారాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు తులా లగ్నం, తులారాశి వారు అని చెప్పడానికి 10 లక్షణాలు

1. మేధావులుగా కలిగినవారైతే, 

2. సమస్యకు పరిష్కారం కనుగొనేవారైతే

3. నేర్పు కలిగినవారైతే 

4. ఆకర్షమైన రూపం కలిగినవారైతే

5. రొమాంటిక్ అయితే 

6. అందరితో సరదాగా కలిసేవారైతే 

7. అనేకమంది మిత్రులు కలిగినవారైతే 

8. కష్టించే నైజం కలిగినవారైతే 

9. అనేక విషయాల్లో నేర్పు కలిగినవారైతే 

10. ఆడంబరమంటే ఇష్టం కలిగినవారైతే 

మీరు తప్పకుండా తులారాశివారే ...

8) వృశ్చిక రాశి విశాఖ 4, అనురాధ 1, 2,3,4, జ్యేష్ఠ 1, 2, 3, 4


వృశ్చిక రాశికి చిహ్నం వృశ్చికం అనగా తేలు


అధిపతి శుక్రుడు.. స్థిరమైంది. ఆలోచనలు, అంచనాలు, నిర్ణయాలు కచ్చితంగా ఉంటాయి. ఊగిసలాట ధోరణి పెద్దగా కన్పించదు. దీర్ఘకాలిక అంచనాలు, దూరం ఆలోచించే తత్వం ఉంటాయి. జల స్వభావం అయినందున బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు. గుంభనంగా వ్యవహారాలు చక్కబెడతారు. జరిగిపోయినవి, జరగాల్సినవి అనే స్పష్టత ఉంటుంది. ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నదీ మాత్రం బయటపెట్టరు.

రాశీ చక్రంలో ఎనిమిదవరాశిగా చెప్పుకొనేది వృశ్చికరాశి. తులారాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 210 – 240 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. విశాఖ 1, అనూరాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం నవంబర్ 17 – డిసెంబర్ 15 మధ్యలో పుట్టిన వారిని వృశ్చికరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు వృశ్చికలగ్నం, వృశ్చికరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు

1. లోతుగా ఆలోచించే వారైతే, 

2. మీ అసంతృప్తిని బయటకు వ్యక్తం చేసేవారైతే,

3. భయం లేనివారైతే 

4. ఆకర్షణీయమైన రూపం కలిగినవారైతే

5. కటువుగా మాట్లాడడానికి సందేహించని వారైతే 

6. నమ్మదగినవారని పేరుంటే 

7. విశేషమైన శక్తియుక్తులు కలిగినవారైతే 

8. పైకి ఒకటి లోపల ఒకటి ఆలోచించేవారైతే 

9. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేవారైతే 

10. ఎవరితోనూ అనుబంధం పెంచుకోని వారైతే 

మీరు తప్పకుండా వృశ్చికరాశివారే ...

9) ధనస్సు రాశి:

మూల 1, 2, 3,4, పూర్వాషాడ 1, 2, 3,4, ఉత్తరాషాడ 1


ధనస్సు రాశికి చిహ్నం ఎక్కు పెట్టిన బాణం


అధిపతి బృహ‌స్పతి.. ఇది కూడా ద్వి స్వభావ రాశి. కొన్నిసార్లు వేగంగా, మరికొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది. కాబట్టి వీరికి మిశ్రమ ధోరణిని అవలంభిస్తారు. నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది. స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు రెండు రకాల వ్యకిత్వాన్ని, లక్షణాలను కలిగి ఉంటారు. సమయాన్ని బట్టి ఎలా ఉండాలో వీరికి బాగా తెలుసు.

రాశీ చక్రంలో తొమ్మిదవరాశిగా చెప్పుకొనేది ధనూరాశి. వృశ్చికరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 240 – 270 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. మూల 4, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం డిసెంబర్ 16 – జనవరి 14 మధ్యలో పుట్టిన వారిని ధనూరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు ధనుర్లగ్నం, ధనస్సు రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు

1. మీరు ఆశావాదులైతే, 

2. మీకు మంచివారనే పేరుంటే,

3. మంచి మిత్రులు సహాయం చేసేవారైతే, 

4. నిజాయితీతో కూడిన సంబంధాలు కలిగినవారైతే,

5. ఒక్కొక్కసారి అతివిశ్వాసం కలిగినవారైతే, 

6. అతిగా మాట్లాడేవారయితే, 

7. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయేవారయితే, 

8. పైకి ఒకటి లోపల ఒకటి ఆలోచించేవారైతే 

9. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేవారైతే 

10. విశేషమైన శక్తియుక్తులు కలిగినవారైతే 

మీరు తప్పకుండా ధనూరాశివారే ...

10) మకర రాశి:


ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదములు


మకర రాశికి చిహ్నం ముసలి


అధిపతి రవి.. కాలపురుషుని కర్మ స్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమౌతుంది. వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇతరుల చేతిలో మోసపోనంత వరకూ మోసగించాలనే తలంపు రాదు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల పట్ల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత. చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. లోపం తెలిసిన తరువాత తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి.

రాశీ చక్రంలో పదవరాశిగా చెప్పుకొనేది మకరరాశి. ధనూరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 270 – 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. ఉత్తరాషాఢ 3, శ్రవణం 4, ధనిష్ట 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం జనవరి 15 – ఫిబ్రవరి 12 మధ్యలో పుట్టిన వారిని మకరరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు మకర లగ్నం, మకర రాశి వారు అని చెప్పడానికి 10 లక్షణాలు

1. మీరు కార్యసాధకులైతే, 

2. మీకు క్రమబద్ధంగా పనిచేసేవారనే పేరుంటే,

3. ఓర్పు ఎక్కువ ఉన్నట్లయితే, 

4. మీరు మంచి నాయకత్వ లక్షణాలు కలిగినవారైతే,

5. కష్టించే తత్వం కలిగినవారైతే, 

6. స్నేహపాత్రులయితే, 

7. అనుభవానికి పెద్దపీట వేసేవారయితే, 

8. క్రమశిక్షణంటే ప్రీతి కలిగినవారయితే 

9. చేయవలసిన పనిపై పూర్తిగా మనస్సు లగ్నం చేసేవారయితే, 

10. ఆకర్షణీయమైనవారైతే 

మీరు తప్పకుండా మకరరాశివారే ...

11) కుంభ రాశి:


ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3

కుంభరాశికి చిహ్నం కుండ


అధిపతి శని. ఈ రాశివారు బంధాలు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు. అవేశం, ఇతరులు రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు. విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి. సాంకేతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తారు. అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు సర్ధుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజములో ఉన్నత, గౌరవ స్థానాలలో ఉన్నవారితో అన్యాయానికి గురవుతారు.

రాశీ చక్రంలో పదకొండవరాశిగా చెప్పుకొనేది కుంభరాశి. మకరరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 300 - 330 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. ధనిష్ట 2, శతభిషం 2, పూర్వాభాధ్ర 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం ఫిబ్రవరి 13 – మార్చి 14 మధ్యలో పుట్టిన వారిని కుంభరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


మీరు కుంభ లగ్నం, కుంభ రాశి వారు అని చెప్పడానికి 10 లక్షణాలు

1. మీరు మాటకారులైతే, 

2. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే,

3. మీరు పరిస్థితులను మీకు అనుగుణంగా మార్చుకునేవారు అయితే, 

4. మీరు స్వాతంత్ర్యంగా జీవించేవారైతే,

5. మీరు ప్రపంచాన్ని ఉద్దరించేలా మాటలు మాట్లాడేవారైతే, 

6. మీరు ఎవరు ఏమన్నా పట్టించుకోని వారయితే, 

7. మీరు బద్ధకస్తులయితే, 

8. మీరు మంచి ఆలోచనలు కలిగినవారయితే 

9. మీరు నిజాయితీపరులయితే, 

10. మీరు బవబంధాలు పెద్దగా లేనివారైతే 

మీరు తప్పకుండా కుంభరాశివారే ...

12) మీన రాశి:

పూర్వభద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4 పాదములు, 

మీనరాశికి చిహ్నం రెండు చేపలు.


ఈ రాశికి అధిపతి గురువు.. ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒక వేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్ధ్యం, స్థిరత్వం ఉంటుంది. ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. ఉన్నత స్థానాలలోని బంధువులను కలిగి ఉంటారు. విద్యారంగలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్ధ్యంగా వృద్ధి చేస్తారు. ఉన్నత ఆశయం కోసం ఎదురుచూస్తారు. ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. సంగీతం, క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప మలుపునకు దారి తీస్తాయి.


రాశీ చక్రంలో పన్నెండవ మరియు చివరిరాశిగా చెప్పుకొనేది కుంభరాశి. కుంభరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 330 - 360 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. పూర్వాభాధ్ర 1, ఉత్తరాభాధ్ర 4, రేవతి 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం మార్చి 15 – ఏప్రియల్ 13 మధ్యలో పుట్టిన వారిని కుంభరాశి జాతకులుగా చెప్పబడ్డారు.


   మీరు మీన లగ్నం, మీన రాశి వారు అని చెప్పడానికి 10 లక్షణాలు

1. మీరు మితిమీరిన భావోద్వేగాలు కలిగినవారైతే, 

2. మీరు అసంబద్ధ నిర్ణయాలు తీసుకొనేవారయితే,

3. మీరు పలాయనవాదులయితే, 

4. మీరు ఆదర్శంగా ఉండాలనుకొనేవారైతే,

5. మీరు ఒక్కొక్కసారి అతివిశ్వాసం ప్రదర్శించేవారైతే, 

6. మీరు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయేవారయితే, 

7. మీరు బద్ధకస్తులయితే, 

8. మీరు మంచి ఆలోచనలు కలిగినవారయితే 

9. మీరు నిజాయితీపరులయితే, 

10. మీరు పైకి ఒకటి లోపల ఒకటి ఆలోచించేవారయితే 

మీరు తప్పకుండా మీనరాశివారే ...

Comments